రాప్తాడు: సనప గ్రామంలో మొహరం వేడుకల్లో భాగంగా పేర్లను ప్రత్యేకంగా అలంకరించి గ్రామం మొత్తం ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న మొహరం వేడుకలు ఘనంగా ముగించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సనప గ్రామంలో మొహరం వేడుకల్లో భాగంగా చివరి రోజు వీళ్లలో అగ్నిగుండం ప్రవేశం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి గ్రామం మొత్తం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గత వారం రోజులుగా నిర్వహిస్తున్న మొహరం వేడుకలు జల్లికి తీసుకోవడంతో మొహరం వేడుకలు ముగియడం జరిగిందని సనప గ్రామస్తులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.