మార్కాపురం దారిమడుగు ఫ్లైఓవర్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.