నేలకొండపల్లి: నేలకొండపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నేలకొండపల్లి ఎంపీడీవో కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. గ్రామ స్వరాజ్య స్థాపనతోనే సమాజ వికాసం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్, ఎంపీడీవో ఎర్రయ్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.