ఉరవకొండ: పెన్నాఅహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహనంపై విహరించిన స్వామివారు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడ వీదుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారి పంచామృత అభిషేకాలు పుష్పాలంకరణ పూజలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.