సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
చీమకుర్తి పట్టణంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి వైద్య శిబిరాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ... ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వైద్య శిబిరంలో శస్త్ర చికిత్సలు అవసరమైన వృద్ధులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.