రాప్తాడు: రామగిరి మండల కేంద్రంలో 64 మందికి దివ్యాంగులకు కృత్రిమ పరికరాలను పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రామగిరి కనకానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాలకు చెందిన దివాంగులకు కృత్రిమ అవగాయాలను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ సత్యసాయి జిల్లా సర్వ శిక్షణ అభియాన్ సహకారంతో 20 లక్షల రూపాయల విలువైన దివ్యాంగుల కృత్రిమ అవయవాలు సహాయక పరికరాలను దివ్యాంగులకు పంపిణీ చేయడం జరిగిందని భవిష్యత్తులో దివ్యాంగుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్షణ అభియాన్ సిబ్బంది దివ్యాంగులు పాల్గొన్నారు.