ఉరవకొండ: యలగలవంక గ్రామంలోని దళితవాడలో తీవ్రమైన త్రాగు నీటి ఎద్దడి
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం యలగలవంక గ్రామంలోని దళిత వాడలో తీవ్రమైన త్రాగు నీటి ఎద్దడి నెలకొందని కాలనీవాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి పంచాయితీ బోర్ నీరే లేదు, ఉన్న సాయి బాబా నీరు కూడా వారం రోజులుగా రాకపోవడంతో నీటికోసం గ్రామ ప్రజలు 2km దూరం కాలినడకన, కొంతమంది ఆటో లలో బాడుగ ఇచ్చి తోటల్లోకి వెళ్లి తెంచుకుంటున్నారు. త్రాగునీటి సమస్యను వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.