కనిగిరి: పట్టణంలోని పెద్ద చెరువును అధికారులతో కలిసి పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని పెద్ద చెరువును రెవిన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, మున్సిపల్, పోలీస్ అధికారులతో కలిసి కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం పరిశీలించారు. పెద్ద చెరువు అలుగు వాగును ఎమ్మెల్యే పరిశీలించి, చెరువులో విపరీతంగా పెరిగిన చిన్న చెట్లను వేలం ప్రక్రియ ద్వారా తక్షణం తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వాగు నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.