కనిగిరి: ఈనెల 6న కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీ బందోబస్తు: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్లో ఈనెల 6వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు హాజరవుతున్న నేపథ్యంలో బందోబస్తు చర్యలపై ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం పోలీసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఐపి ల రాక నేపథ్యంలో భారీ బందోబస్తు చర్యలను చేపట్టాలని సీఐ శ్రీనివాసులు కు సూచించారు. పార్కింగ్, ట్రాఫిక్ మల్లింపు వంటి చర్యలు చేపట్టాలన్నారు.