సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు లో తాగునీటి సమస్యను పరిష్కరించిన పంచాయతీ అధికారులు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు లోని చింతచెట్టు కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి స్థానికులు తీసుకువెళ్లడంతో పంచాయతీ అధికారులు స్పందించారు. శనివారం పంచాయతీ కార్యదర్శి సూర్యనారాయణ సిబ్బందితో కలిసి కాలనీలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాలుగు కుళాయిలను ఏర్పాటు చేయించారు. కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. సమస్యను పరిష్కరించిన పంచాయతీ అధికారులకు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.