కనిగిరి: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి
హనుమంతునిపాడు మండలం ఈదరవారి పల్లిలో బుధవారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి రూ .65 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన తార రోడ్డును అధికారులతో కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే ఈదరవారి పల్లె నుండి మాసాయిపేట గ్రామానికి తారు రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేని ఈ రెండు గ్రామాల ప్రజలకు నేటితో ఆ సమస్య తీరిందన్నారు.