*జనసేన సైనికులు బలహీనులు కారు.. బ్రహ్మాస్రాలు..*
*- కూటమి ధర్మాన్ని పాటించకపోతే ఊడిగం చేసేది లేదు..*
*- జనసేన త్యాగాలను విస్మరించొద్దు.*
*- స్థానిక ఎన్నికల్లో సముచిత వాటా కల్పించాలి.*
*- జనసేన తర్లుపాడు మండల నాయకులు వెలుగు కాశీరావు.*
*-తర్లుపాడు అగ్ని న్యూస్ :* కురుక్షేత్ర యుద్ధంలో,మహాభారతంలోని అర్జునుడి విజయాలకు శ్రీకృష్ణుడి పాత్ర ఎంత కీలకమైనదో ఎన్డీఏ కూటమి విజయానికి వెనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర అంతే కీలకమైనదని,జనసేన సైనికులు బలహీనులు కారని.. బ్రహ్మాస్రాలని.. తర్లుపాడు మండల జనసేన నాయకులు వెలుగు కాశీరావు తెలియచేశారు.ప్రస్తుతం కూటమి నాయకుల వ్యవహారం "ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న" అనే విధంగా వారి విధానం కొనసాగుతుందని మండలంలోని అన్ని గ్రామాలనుంచి జనసైనుకులు అధిష్టానానికి తెలియచేస్తున్నారు అని చెప్పారు..ఇది సరైన పద్ధతి కాదని, ఇక నుంచైనా అందరిని కలుపుకొని పోవాలని, లేని పక్షంలో వేరే పార్టీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పారు .మండల కేంద్రంలోని తర్లుపాడులో సోమవారం జనసేన కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మిడి కాశీనాథ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ ఇమ్మిడి కాశీనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని,పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎంతో శ్రమించి కూటమి విజయానికి కృషి చేశారని అన్నారు.ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో జనసేనకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పార్టీ శ్రేణులకు సముచిత గుర్తింపు ఇవ్వాలని కోరారు.తర్లుపాడు మండల కేంద్రంతో పాటు,మండల పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలను జనసేనకు కేటాయించే విషయంలో టీడీపీ నాయకులు సానుకూలంగా స్పందించాలని,మిత్రపక్షాల మధ్య పరస్పర గౌరవం,సహకారం,సమన్వయం ఉన్నప్పుడే కూటమి మరింత బలోపేతమవుతుందని అన్నారు.జనసేన నాయకుల అభ్యర్థిత్వాన్ని టీడీపీ నాయకులు పెద్ద మనసుతో బలపరచి,వారికి తగిన అవకాశాలు కల్పించాలని కోరారు.జనసేన పార్టీ అధ్యక్షుడు,రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాయకులు,కార్యకర్తలు కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని వెలుగు కాశీరావుని సూచించారు.మూడు పార్టీల నాయకులు పరస్పర అవగాహనతో వ్యవహరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 6.87% సుమారు 7% ఓట్లతో 21 స్థానాల్లో పోటీ చేసి, 21 స్థానాలను కైవసం చేసుకుని 100శాతం విజయాన్ని