సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం, ఉప్పుగుండూరు సమీపంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడులు, నలుగురు అరెస్ట్
నాగులుప్పలపాడు: కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్టు చేసిన సంఘటన నాగులుప్పలపాడు మండలం, ఉప్పుగుండూరు సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పుగుండూరు సమీపంలో కోడిపందాల స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి సీఐ భీమా నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై చెంచయ్య కోడిపందాల స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి 1 బైక్, 2 కోళ్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.