కనిగిరి: పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ పనులను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పనులను కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈనెల ఆరో తేదీన కనిగిరిలో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 25 వేల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హాజరవుతున్న నేపథ్యంలో బందోబస్తుపై చర్చించారు.