రాప్తాడు: పెనుబోలు గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి మేడే కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండలం గంతి మర్రి పంచాయతీ పెనుబోలు గ్రామంలో 11 గంటల పది నిమిషాల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో కలిసి నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా మేడే విశిష్టత గురించి వారికి వివరించడం జరిగిందని అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో ఎంత లబ్ధి పొందుతున్నారు ఎంత ఉపాధి హామీ కూలి లభిస్తుందని వివరాలు కూడా కూలీలను అడిగి తెలుసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.