రాయదుర్గం: పంటల బీమా నమోదుకు చివరి గడువు, CSC కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు
పంట బీమా నమోదుకు వరి మినహా మిగతా పంటలకు ఈనెల 31 చివరి గడువు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం పట్టణంలోని సీఎస్సీ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరుతున్నారు. సర్వర్ సమస్యలు, సిబ్బంది కొరత, అధిక రద్దీతో గంటల తరబడి వేచి ఉన్నా నమోదు ఆలస్యమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తిండి తిప్పలు మాని రోజంతా కేంద్రాల వద్ద ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఇంకా వేలాది మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. రాయదుర్గం మండలంలో 12650 మంది రైతులు ఉండగా 8343 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు.