ఉరవకొండ: బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో( PMSMA) ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభయాన పథకంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో( PMSMA) ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభయాన పథకం భాగంగా సోమవారం వైద్యాధికారులు ప్రియాంక, హిమబిందుల ఆధ్వర్యంలో ప్రతినెల హైరిస్క్ గర్భవతులను గుర్తించడం, గర్భిణీ స్త్రీలను పరీక్షించి రక్త శాతం, BP పరీక్షలు చేయడం, గర్భిణీ స్త్రీలు , మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్య సలహాలు తెలపడం జరిగినది. పీ హెచ్ సీ వద్ద వచ్చిన గర్భిణీలకు కీర్తిశేషులు పాటిల్ చంద్రశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు పాటిల్ కొండారెడ్డి కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి 130 మంది గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనమును అందించి ప్రతి నెల కొనసాగిస్తున్నామన్నారు.