కనిగిరి: నందన మారెళ్ళ సమీపంలో రోడ్డు ప్రమాదం, గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
కనిగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన కనిగిరి మండలంలోని నందన మారెళ్ళ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోటార్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని నందన మారేళ్ళ సమీపంలో గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ బైక్ పై వెళ్తున్న వ్యక్తి కింద పడిపోయి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు 108 అంబులెన్స్ లో తరలించారు.