ప్రకాశం జిల్లా కొండపిలోని గురుకుల పాఠశాలలో మాకు డ్రిల్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. డిసెంబర్ 5వ తేదీన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందని ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులను ఆహ్వానించినట్లు మండల విద్యాశాఖ మరియు రెవెన్యూ అధికారులు విద్యార్థులకు తెలిపారు. ఆరోజు విద్యార్థుల పాఠశాలల సమస్యలపై చర్చించడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుపై వారి అభివృద్ధిపై మాట్లాడడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారులు అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.