కొత్తగూడెం: ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు.*
శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం శ్రీయుత జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా ఆధ్వర్యంలో వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని కొత్తగూడెం క్లబ్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విద్యా చందన, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, పద్మావతి జిల్లా రెవెన్యూ అధికారి, నాగలక్ష్మి జడ్పీ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్, అనూష జిల్లా పంచాయతీ అధికారి జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కట్ చేసి, ఎం.డబ్ల్యు.పి.ఎస్.సి. చట్టం 2007 పుస్తకాలను ఆవిష్కరించి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ వయో వృద్ధులను గౌరవించాలని, వారు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి కొడుకులని, కూతుర్లను ప్రయోజకులను చేశారని, ఇప్పటి తరం వాళ్లు పెద్దలను గౌరవించి వారి విలువలు తెలుసుకోవాలని తెలిపారు. అర్హులైన వయోవృద్ధులకు చేయూత పెన్షన్లు అందించడం జరుగుతుందని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వెరిఫికేషన్ తర్వాత కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యాలను తీసుకోవాలని, వయో వృద్ధులకు బ్యాంకులలో ఆసుపత్రిలో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ ఆఫీసు నందు తల్లితండ్రుల మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 ప్రకారం మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ చైర్మన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ద్వారా కుటుంబ సభ్యులు వృద్ధ తల్లిదండ్రులకు పోషణ భృతి కల్పించేలా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులు పోషణ భృతి కల్పించకపోయిన, నిరాదరణకు గురి చేసిన, ఆస్తులు లాక్కొని వెళ్లగొట్టిన తమ ఆర్డీవో ఆఫీసులో సంప్రదించాలని, విచారణ తర్వాత కుటుంబ సభ్యులకు ఎండబ్ల్యూపీఎస్సీ 2007 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జడ్పీ సీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి మండలంలో వయోవృద్ధుల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా జిల్లా నందు ఉన్న అన్ని మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని, పెద్ద ఙ్ఞాన బాండాగారాలు అని, వారి అనుభవాలు మన తరాలకు మన పిల్లల తరాలకు ఎంతో ఉపయోగపడతాయని, వారిని గౌరవించడం మన ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి అనూష మాట్లాడుతూ ప్రస్తుత సీనియర్ సిటిజన్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల సంక్షేమానికి సేవలు చేస్తున్నందుకు వారి సేవలు వెలకట్టలేమని కొనియాడారు.జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వయోవృద్ధులను నిర్లక్ష్యం చేయడం, పోషణ భృతి కల్పించకపోవడం, కనీస అవసరాలు తీర్చలేకపోవడం, వారితో కుటుంబ సభ్యులు మాట్లాడకపోవడం, కుటుంబ సభ్యులు ఉద్యోగరీత్యా, ఉపాధిక కొరకు వేరే ప్రదేశాలకు వెళ్లి తల్లి తండ్రులను పట్టించుకోకపోవడం ఎక్కువగా జరుగుతున్నాయని, అందువల్ల వయో వృద్దులు ఒంటరితనంతో బాధ పడుతున్నారని, కుటుంబ సభ్యులు ఖాళీ దొరికినప్పుడల్లా వృద్ధ తల్లిదండ్రులతో సమయం గడపాలని తెలిపారు. జిల్లా నందు ఏడుగురు వృద్ధాశ్రమాలు నడపబడుతున్నావని, వయోవృద్ధుల కాలక్షేపం కొరకు బాబు క్యాంప్ నందు ప్రణాం డే కేర్ సెంటర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్మించడం జరిగిందని, వయోవృద్ధులను నిర్లక్ష్యం చేయుట, పోషణ భృతి కల్పించకపోవడం, కనీస అవసరాలు తీర్చకపోయినా రెవిన్యూ డివిజన్ ఆఫీస్ కి వెళ్లలేని వారు tgseniorcitizens.cgg.g.ov.in ఆన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, వయో వృద్ధుల హెల్ప్ లైన్ నంబర్ 14567 ఉపయోగించుకోవాలని తెలిపారు. వయో వృద్ధుల సంక్షేమం, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సంఘాలను స్వచ్ఛంద సంస్థల సభ్యులు రావి వెంకటయ్య, చాగంటి కృష్ణమూర్తి, వాసాల నాగమణి, సీతారామశాస్త్రి, రామయ్య, శంకర్, సుజాత, సరోజ సుబ్బారావు లను సన్మానించడం జరిగింది. హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దినేష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటిజన్ అసోసియేషన్ సభ్యులు నాగేశ్వర రావు, సురేష్, భూషణ్ రావు, పి ఎస్ ఎన్ రెడ్డి, పాపయ్య, వెంకటేశ్వర రావు, కృష్ణయ్య, సందీప్, పి.ఎస్.ఎన్.రెడ్డి, జయరాం, వెంకటేశ్వర్లు, బుచ్చయ్య, నాగేశ్వరరావు, అబ్రహం, లక్ష్మయ్య, సిబ్బంది హరి కుమారి, రూప, వరప్రసాద్ నరేష్, ప్రవీణ్, వైద్య సిబ్బంది మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.