సంతనూతలపాడు: చీమకుర్తి మండలంలోని రామతీర్థం శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్లకు 10 ప్రత్యేక ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు
చీమకుర్తి మండలం లోని రామతీర్థంలో శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం నేడు బుధవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ రాత్రికి జరిగే తిరునాళ్లకు సంబంధించి 10 ప్రత్యేక ఆర్టిసి బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. తిరునాళ్ల ముగిసే వరకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు కొనసాగుతుంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రామతీర్థం నుండి చీమకుర్తికి, అదేవిధంగా చీమకుర్తి నుండి రామతీర్థం కు ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు చేరవేస్తాయన్నారు.