సంతనూతలపాడు: చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ అజాలత్ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు
చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ అధికారులు బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను అర్జీల ద్వారా విద్యుత్ శాఖ అధికారులకు సమర్పించి వాటిని పరిష్కరించాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా విద్యుత్ శాఖ అధికారి కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ అదాలత్ కు 26 అర్జీలు వచ్చాయని వాటిని పరిష్కరిస్తామన్నారు.