కనిగిరి: పట్టణంలో గురుకుల పాఠశాల, కస్తూరిబా పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న గురుకుల పాఠశాల భవనాలు మరియు కస్తూరి గాంధీ బాలికల పాఠశాలలోని అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు. అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ, పనులు త్వరితగతిన పూర్తయ్యలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.