కనిగిరి: న్యూడ్ ఫోటోలు, వీడియోలతో బెదిరించడం వల్లే మాధవి ఆత్మహత్య: పామూరు ఎస్సై అనూక్
పామూరు మండలం అయ్యవారిపల్లి లో మాధవి అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మాధవి ఆత్మహత్యపై పామూరు ఎస్సై కట్ట అనూక్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. పామూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మాధవి టీచరుగా పనిచేస్తుందని, నాగూర్ భాష అనే వ్యక్తి పిల్లలు అదే పాఠశాలలో చదువుతున్న క్రమంలో మాధవితో నాగూర్ భాషకు పరిచయం ఏర్పడిందని ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న మాధవి న్యూడ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో, వేధింపులు తాళలేక మాధవి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.