కనిగిరి: పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆరోపించారు. కనిగిరిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం వైసిపి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గం లో 75 గ్రామాల్లో రైతులు పొగాకును పండిస్తున్నారు అన్నారు.. ఈ ఏడాది 8 మిలియన్ కేజీల పొగాకును రైతులు పండిస్తే ,కేవలం ఇప్పటివరకు 1.8 మిలియన్ల కేజీల పొగాకును మాత్రమే కొనుగోలు చేశారన్నారు. పొగాకు రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి నిరసనగా కనిగిరిలో ఈనెల 16న రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.