అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బతో శంకరప్ప (75) అనే బిచ్చగాడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. భిక్షాటన చేస్తూనే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడని స్థానికులు సమీప బంధువులు పేర్కొన్నారు. మృతుని దహన సంస్కారాలను గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వహించారు.