రాప్తాడు: రంగంపేట వద్ద 70 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం రంగంపేట గ్రామం వద్ద ఆదివారం ఐదున్నర గంటల సమయంలో తగరకుంట రంగంపేట గ్రామాల మధ్య 70 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును ఎమ్మెల్యే పరిటాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రంగంపేట గ్రామం వద్ద 70 లక్షల రూపాయలతో సిసి రోడ్డును ప్రారంభించడం జరిగిందని అదేవిధంగా ఒకటిన్నర కోటితో చెరువు మరమతి చేపట్టి సిమెంట్ కాంక్రీట్ వాళ్లు కూడా నిర్మించడం జరిగిందని, అదేవిధంగా మాధవరాజులో దేవాలయం వద్ద తలవై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పరిటాల సునీత పేర్కొన్నారు.