కనిగిరి: వెలిగండ్లలో పిడుగుపాటు, తప్పిన ప్రమాదం, తాటి చెట్టు పై పిడుగు పడడంతో దగ్ధమైన తాటి చెట్టు
వెలిగండ్ల లో గురువారం సాయంత్రం స్థానిక పెట్రోల్ బంకు వెనుక వైపు ఉన్న పొలాల్లో ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు తాటి చెట్టుపై పడడంతో చూస్తుండగానే తాటిచెట్టు దగ్ధమైంది. పిడుగు పడిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పిడుగుపాటు పై ముందస్తు సమాచారాన్ని మండల ప్రజలకు మొబైల్ సందేశం ద్వారా పంపింది. మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.