గిద్దలూరు: కంభం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్పై గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి, దర్యాప్తు చేపట్టిన స్థానిక రైల్వే పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. మృతుడు అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా అధికారులు ప్రస్తుతం గుర్తించారు.