ఉరవకొండ: పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ ) ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్,గ్యాస్,నిత్యవసర సరుకులు ధరలపై నిరసన
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ ) ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్. డీజిల్. గ్యాస్. నిత్యవసర సరుకులు ధరలను. పెంచడానికి వ్యతిరేకిస్తూ ఇంటింటా కరపత్రాలు పంచుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. బి కేశవరెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి చిన్న రాయుడు పార్టీ నాయకులు కలిసి బుధవారంర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల రోజులు కాలంలోనే పెట్రోలు. డీజిల్. గ్యాస్. ధరలను నాలుగు సార్లు పెంచడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని పేర్కొన్నారు.