కనిగిరి: పట్టణంలో మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను పరిశీలించిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి పట్టణంలోని మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి తో కలిసి శనివారం పరిశీలించారు. మంచినీటి దొరువు ఆధునికీకరణ, అభివృద్ధి పనుల వివరాలను మంత్రి స్వామికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వివరించారు. దొరువు అభివృద్ధి పనుల్లో భాగంగా చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.