ఉరవకొండ: గడేకల్లు -విడపనకల్లు ప్రధాన రహదారిపై అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన మట్టిని తరలిస్తున్న టిప్పర్ వాహనం
అనంతపురం జిల్లా విడపన కల్లు మండలంలోని గడేకల్లు విడపనకల్లు ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని డొనేకల్లు చెరువు నుండి చెరువు మట్టిని తరలిస్తూ ఉన్న టిప్పర్ వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో పాటు సమీప పొలాల్లోకి టిప్పర్ వాహనం దూసుకెళ్లింది. అధిక వేగంతో వెళ్తున్న టిప్పర్ వాహనంలోని మట్టి మొత్తం పొలంలో పడిపోయింది. స్థానిక రైతులు అప్రమత్తమై టిప్పర్ వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను జాగ్రత్తగా బయటికి తీశారు. రోడ్డు ప్రమాదంలో మరెవరికి ఎలాంటి గాయాలు కాలేదు. గజనా స్థలాన్ని బిడ్డ పైన కళ్ళు పోలీసులు పరిశీలించారు.