కనిగిరి: శ్రీ షిరిడి సాయిబాబా బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి: శ్రీ షిరిడి సాయిబాబా బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన శ్రీ షిరిడి సాయిబాబా భక్త మహాసమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ఆపదలో ఉన్న సాటి మనిషికి సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం ఉత్తమ మార్గమని బాబా చెప్పారన్నారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, సబ్ కా మాలిక్ ఏక్ అని ఉద్బోధించిన దైవం బాబా అని ఎమ్మెల్యే అన్నారు.