కనిగిరి: వెలిగండ్ల మండలం రామలింగాపురంలో గాలి,వాన బీభత్సం, రహదారులపై విరిగిపడ్డ చెట్లు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
వెలిగండ్ల మండలం రామలింగాపురంలో ఆదివారం సాయంత్రం గాలి,వాన బీభత్సం సృష్టించింది. గాలివాన బీభత్సానికి చెట్లు విరిగిపడి రహదారులపై పడ్డాయి. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై చెట్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకులకు అంతరాయం ఏర్పడింది. అధికారులు తక్షణం స్పందించి రహదారులపై విరిగిపడ్డ చెట్లను తొలగించి, వాహనాలు రాకపోకలు సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.