ఉరవకొండ: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : అడిషనల్ డి ఎం అండ్ హెచ్ ఓ జయలక్ష్మి
అనంతపురం జిల్లా అడిషనల్ DMHO మరియు జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ జయలక్ష్మి లు విడపనకల్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యా ఆరోగ్య సిబ్బందికి మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి తో కలిసి మంగళవారం సమావేశం పెట్టుకొని సీజన్ వ్యాధుల పైన అవగాహన కల్పించారు. ప్రధానంగా వర్షాకాలంలో దోమలు ఉధృతి ఎక్కువగా ఉంటుందని ప్రజలు దోమలు కుట్టకుండా దోమతెరలు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ డ్రైడే పాటించాలని ఇళ్ల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలు అంశాలపై వైద్యాధికారులు అవగాహన కల్పించారు.