కనిగిరి: కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా టిడిపి మహానాడు కార్యక్రమం
కనిగిరి నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం టిడిపి మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని కనిగిరి, హనుమంతునిపాడు, పెదచెర్లోపల్లి, వెలిగండ్ల, పామూరు, చంద్రశేఖరపురం మండలాల్లో రెండవ రోజు మహానాడు కార్యక్రమం మండల పార్టీల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిల సమక్షంలో నిర్వహించారు. రెండవ రోజు గురువారం టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జన్మదినం కావడంతో, మహానాడు ప్రాంగణాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి టిడిపి నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఏ ఆశయంతో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు.