ఉరవకొండ: ఆర్టీసీ బస్సు పై రాళ్లతో దాడి ప్రయాణికుడికి గాయాలు
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం విరుపపల్లి గ్రామంలో శనివారం ఉరవకొండ నుండి బెలుగుప్ప, విరుపా పల్లి మీదుగా కళ్యాణదుర్గం వెళుతున్న ఆర్టీసీ బస్సు పై గ్రామానికి చెందిన శంకర్ రాయి తో కొట్టడం తో బస్ వెనుక అద్దం పగిలి బస్సులో ఉన్న ప్రయాణికుడువెంకటస్వామి కంటి పై భాగం తగిలి రక్త గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన బస్సు కండక్టర్ బెలుగుప్ప పిహెచ్సికి బస్సులోనే గాయపడిన ప్రయాణికున్ని తరలించి చికిత్సలు చేయించారు. అనంతరం బెలుగుప్ప పోలీసులకు ఘటన పై కండక్టర్ ఫిర్యాదు చేసింది.