రాయదుర్గం: కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి: మాజీ MLA కాపు రామచంద్రారెడ్డి
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ MLA కాపు రామచంద్రారెడ్డి అన్నారు. పేదలకు రేషన్ బియ్యం, గృహ నిర్మాణాలు, సిమెంటు రోడ్ల నిర్మాణం, ఉపాధి పనులు సహా అన్ని పనులకు కేంద్రం విరివిగా సహాయం చేస్తోందని స్పష్టం చేశారు. రాయదుర్గంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ కేంద్ర పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.