సంతనూతలపాడు: మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు లో పర్యటించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్
మద్దిపాడు మండలంలోని ఏడు గుండ్లపాడు లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఏడు గుండ్లపాడు హరిజన కాలనీలో ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే... రానున్న వర్షాకాలం నేపథ్యంలో ముంపుకు గురయ్యే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి, స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.