రాప్తాడు: ఓబులాపురం గనుల్లో అక్రమంగా ఖనిజాన్ని తరలించకుండా అడ్డుకోండి పాపంపేటలో బహుజన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట వద్ద జై భీమ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు గురువారం 12 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గం ఓబులాపురం గనుల్లో విలువైన ఖనిజాన్ని కొంతమంది అక్రమంగా రాత్రి వేళలో తరలిస్తున్నారని నాలుగు టిప్పర్ లారీలను పట్టుకున్న అధికారుల ఒత్తిడితో వదిలివేయడం జరిగిందని ఇప్పటికైనా కర్ణాటక కు అక్రమంగా ఖనిజాన్ని తరలిస్తూ విక్రయిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.