కనిగిరి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుంది: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
కనిగిరి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కనిగిరిలోని అర్బన్ కాలనీలో మంగళవారం రూ.2.05 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 15 సీసీ రోడ్లను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో పెద్ద ఎత్తున సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా రైతాంగానికి, గృహాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.