కనిగిరి: మార్కాపురంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత నిర్వహించిన అభివృద్ధిపై సమీక్షకు హాజరైన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి శాసనసభ్యులు, మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మార్కాపురంలో బుధవారం జిల్లా కలెక్టర్ విజయ సునీత జిల్లా అభివృద్ధి కార్యచరణ పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. మార్కాపురం జిల్లాలో కనిగిరి నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, కనిగిరి నియోజకవర్గం లోని సమస్యలు, మౌలిక వసతులు, అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ తో కలెక్టర్ విజయ సునీతతో ఎమ్మెల్యే చర్చించారు. కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జెసి శ్రీనివాస్, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొన్నారు