కనిగిరి: పామూరు మండలం దూబగుంట వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ కంటైనర్ లారీ, స్వల్ప గాయాలతో బయటపడ్డ కంటైనర్ డ్రైవర్
పామూరు: కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన పామూరు మండలం రామతీర్థంలో దూబగుంట వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దూబగుంట జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్ లారీ టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.