రాయదుర్గం: తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈఆర్ఓ సమావేశం, పలు అభ్యంతరాలు లేవనెత్తిన వైసిపి
అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని రాయదుర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముసాయిదా ఓటరు జాబితా అన్ని బీఎల్ఓల వద్ద అందుబాటులో ఉంటుందని, ఓటర్లు తమ పేర్లను పరిశీలించుకోవచ్చని సూచించారు. నెల రోజుల పాటు ముసాయిదా జాబితాపై అభ్యంతరాల