ఉరవకొండ: పట్టణంలో ఓ యువకుడు బ్లేడ్ తో శరీరంపై కోసుకొని సైకో చేష్టలతో భయబ్రాంతులకు గురి చేసిన వైనం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో సోమవారం ఓ యువకుడి సైకో చేష్టలు పలువురిని భయబ్రాంతులకు గురి చేసింది. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఓ యువకుడు బ్లేడుతో తనని తాను గాయపరుచుకుంటూ హల్‌చల్ చేస్తూ రోడ్డుపై హంగామా సృష్టించాడు. ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలను అడ్డగించి తన ఛాతిపై గాయాలు చేసుకున్న యువకుడు వీరంగం చేసాడు. పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకుని చాకచక్యంగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. *మీ సాక్షి టీవీ లో...*