ఉరవకొండ: పెన్న అహోబిలంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం. భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగిన పుణ్యక్షేత్రం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల చేసిన గోవింద నామస్మరణలతో పెన్నహోబిలం మార్మోగింది. భక్తులు నమో నరసింహా.. గోవిందా అంటూ రథాన్ని లాగారు.