రాప్తాడు: కురుకుంట వద్ద రాప్తాడు ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో బహుమతులను అందజేసిన పరిటాల సునీత పరిటాల శ్రీరామ్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో కురుగుంట వద్ద ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాప్తాడు ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ పాల్గొని గెలుపొందిన క్రికెట్ టీం సభ్యులకు ట్రోఫీను అందజేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందినీయమని గెలుపొందిన ఇటికలపల్లి క్రికెట్ టీంకు 50 వేలు నగదు రన్నర్ గా నిలిచిన కురుగుంట టీంకు 25 వేల రూపాయలు నగుదును ట్రోఫీలను అందజేయడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.