కనిగిరి: పట్టణంలోని మంగలి మన్యం, కాశిరెడ్డి కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్ , ఎటువంటి ధ్రువపత్రాలు లేని బైకులు స్వాధీనం
కనిగిరి పట్టణంలోని శివారు కాలనీయులైన కాశిరెడ్డి కాలనీ, మంగలి మన్యంలో బుధవారం కనిగిరి డిఎస్పి ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసులు, పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితుల ఇళ్ళలో స్వాదాలు చేపట్టారు. ఎటువంటి ద్రవపత్రాలు లేని బైకులను స్వాధీనం చేసుకొని వాటిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ... గంజాయి వంటి మత్తుపదార్థాలను విక్రయించినా, అక్రమంగా నివాసాల్లో నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.