మహబూబ్ నగర్ అర్బన్: వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కోడూరులో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు ఒరగాబెట్టింది ఏమీ లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ మండలంలోని కోడూరు గ్రామంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రోసిడింగ్స్ పత్రాలను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను ఒక్కోటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. మనిషి తన జీవిత కాలంలో సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశపడతాడని ఆ ఆశను ప్రజా ప్రభుత్వం నెరవేర్చుతుందని స్పష్టం చేశారు, .