మహబూబ్ నగర్ అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ట్రేసా నూతన కార్యవర్గం సభ్యులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం 2025-2028 కాలానికి మహబూబ్ నగర్ జిల్లా శాఖ ట్రేసా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ ఎమ్మెల్యే గారిని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మహబూబ్ నగర్ జిల్లా శాఖ ట్రేసా నూతన కార్యవర్గ అధ్యక్షు కార్యదర్శులతో పాటు ట్రేసా కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.